: కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జీ
డిగ్రీ, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఈ రోజు వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఛాంబర్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరీక్షల విషయంలో తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని వారు అన్నారు. అలాగే కీ పరీక్ష ఫలితాలు తారుమారుగా ఉన్నాయని నిరసన తెలిపారు. వీసీ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.