: ఇది చాలా ఘోరమైన చర్య... ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: కడియం శ్రీహరి


విద్యాసంస్థలను డ్రగ్ మాఫియా లక్ష్యం చేసుకోవడం చాలా ఘోరమైన చర్య అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉపాధ్యాయులు, స్కూల్స్ ను అప్రమత్తం చేసి, విద్యార్థులు ఇలాంటి చెడు వ్యసనాల ఆకర్షణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తామని తెలిపారు. ఏవైనా స్కూల్స్ ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైతే ఆయా స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టిపెట్టాలని, వారిని సక్రమమార్గంలో నడిపించాలని అన్నారు. ప్రధానంగా పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? వంటి విషయాలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను వదిలే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News