: నాకూ చూపించవా...అంటూ వీడియోలను చూసిన గొరిల్లా!
అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఉన్న కెంటకీ జూలో ఉండే గొరిల్లా ఓ యువతితో కలిసి వీడియోలు చూస్తున్న ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. నాకూ చూపించవా? అనేలా గొరిల్లా మోహంలో కనిపిస్తున్న హావభావాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకూ వాళ్లు చూస్తున్న వీడియో ఏంటో తెలుసా? బేబి గొరిల్లాలు ముద్దుముద్దుగా చేసే అల్లరి పనుల వీడియో. కెంటకీ జూలో విహారం కోసం వెళ్లిన లిండ్సే కోస్టేలో గొరిల్లా ఎన్‌క్లోజర్ ముందు దానికి వీడియోలు చూపిస్తూ దిగిన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీనికి వెయ్యికి పైగా లైకులు, రీట్వీట్లు వచ్చాయి.