: దోపిడీకి యత్నించింది ముంబై, కర్ణాటక గ్యాంగ్...ఆరు లేక ఏడుగురు దోపిడీ దారులు: పోలీసులు

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం దోపిడీ ఘటన దర్యాప్తులో పురోగతి సాధించామని రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు. మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి నిందితులు నెలరోజుల ముందే ప్రణాళిక రచించారని వెల్లడించారు. ఈ మేరకు ముంబై, కర్ణాటక నుంచి ఆరు లేక ఏడుగురు దొంగలు పలు మార్లు హైదరాబాదు వచ్చారని తెలిపారు. కారు అద్దాలకు బ్లూ ఫిల్మ్ వాడారని వారు తెలిపారు.

గత నెల రోజులుగా వివిధ చెక్ పోస్టులకు చెందిన సీసీ పుటేజ్ ను పరిశీలించి, వారి ఆనుపానులు గుర్తించామని పోలీసులు చెప్పారు. ఈ మేరకు దోపిడీకి ముందు రోజు అక్కడ రెక్కీ నిర్వహించారని పోలీసులు చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా మైలార్ దేవ్ పల్లి వచ్చారని, దోపిడీ విఫలం కావడంతో మళ్లీ అలాగే వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని వారు పేర్కొన్నారు. వారు వాడిన వాహనం ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నామని, వివిధ రకాలుగా దర్యాప్తు జరుగుతోందని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

More Telugu News