: అన్నను ఆలింగనం చేసుకున్న ఫోటోను పోస్టు చేసి, శుభాకాంక్షలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్!


నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ విషెస్ తెలియజేశాడు. తన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ ను వెనుక నుంచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన జూనియర్ ఎన్టీఆర్... "పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా" అంటూ విషెస్ చెప్పాడు.

జూనియర్ ఎన్టీఆర్ విష్ చేసిన కాసేపటికే కల్యాణ్ రామ్ కు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తాయి. కాగా, కల్యాణ్ రామ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిన్న సాయంత్రం అతని తాజా సినిమా 'ఎమ్ఎల్ఏ' (మంచి లక్షణాలున్న అబ్బాయి) ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మరోసారి కాజల్ కల్యాణ్ రామ్ తో నటిస్తోంది. కాగా, కాజల్ తొలి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.

  • Loading...

More Telugu News