: లైవ్లో పొరపాటు పడిన చైనా సుందరి.. అలోవెరా అనుకుని విషపు మొక్కను తిన్న వైనం.. తప్పిన ప్రాణాపాయం!
చైనాకు చెందిన ఓ హెల్త్ వ్లోగర్ (వీడియో బ్లాగర్) లైవ్లో చేసిన ప్రయత్నం వికటించి ఆస్పత్రి పాలైంది. కలబంద (అలోవెరా) అనుకుని ప్రమాదవశాత్తు అలాగే ఉండే అగావె అమెరికానా(విషపు మొక్కను) లైవ్లో నమిలిన చాంగ్ (24) తీవ్ర అస్వస్థతకు లోనైంది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చాంగ్ ఆ మొక్కను కొరుకుతూ ‘‘ఊ.. ఇది చాలా బాగుంది’’ అని అనడం వీడియోలో వినిపించింది. అగావె అమెరికానా అనేది మెక్సికోకు చెందిన విషపు మొక్క. ఇది అలోవెరాను పోలి ఉంటుంది. అందులో కాల్షియం ఆక్సాలేట్ స్పటికాలు, విష పదార్థాలు ఉంటాయి. దీనిని కొరికిన వెంటనే అస్వస్థతకు గురైన చాంగ్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు.