: జగన్‌తో మల్లాది విష్ణు భేటీ
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మల్లాది విష్ణు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లాది విష్ణు పలు కారణాల వల్ల ఆ పార్టీని వీడారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన జగన్ వద్దకు వచ్చారు. మల్లాది విష్ణు రాజీనామాతో ఏపీలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.