: కోరుకున్న అమ్మాయి ద‌క్క‌కుండా పోతోంద‌ని.. వంతెనపై నుంచి దూకేసి యువకుడి ఆత్మ‌హత్య‌!


తాను ప్రేమిస్తున్న అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయింద‌ని ఆవేదన చెందిన ఓ యువ‌కుడు వంతెన పై నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ముంబయిలోని బాంద్రా వర్లీ వంతెన వ‌ద్ద చోటు చేసుకుంది. ఎప్పుడూ న‌వ్వుతూ చ‌లాకీగా క‌నిపించే ఆ యువ‌కుడు ఒక్క‌సారిగా ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డంతో అత‌డి స్నేహితులు షాక్ అయ్యారు. చ‌నిపోవ‌డానికి ముందు ఆ యువ‌కుడు ఈజీగా ఎలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌చ్చ‌ని త‌న స్మార్ట్‌ఫోన్‌లో సెర్చ్ చేశాడు.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, పవన్‌ జీత్‌ కోహ్లీ (24) అనే యువకుడు ఓ వ్యాపార వేత్త కుమారుడు. ఆ యువ‌కుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇటీవ‌ల ఆ యువ‌కుడి పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌డి తండ్రి ఓ ఆడీ కారును సైతం గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే, తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయిందని తెలుసుకుని బాధ‌ప‌డిపోయిన ఆ యువ‌కుడు తాను కోరుకున్న అమ్మాయి ఇక త‌న‌కు ద‌క్క‌కుండా పోతుంద‌నే మ‌న‌స్తాపంతో ఇలా వంతెన పై నుంచి దూకేశాడు.   

  • Loading...

More Telugu News