: ధోనీకి స్పెషల్ మెసేజ్ పంపిన గిల్ క్రిస్ట్


టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రత్యేక సందేశాన్ని పంపారు. వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్లలో ధోనీ రెండో స్థానానికి చేరుకోవడం పట్ల ఈ సందర్భంగా గిల్లీ ఆనందం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో ధోనీ 9496 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో 9410 పరుగులు చేసిన గిల్ క్రిస్ట్ ను అధిగమించాడు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ధోనీకి గిల్లీ అభినందనలను తెలిపాడు. 'నన్ను అధిగమించినందుకు శుభాకాంక్షలు' అని మెసేజ్ పెట్టాడు. ధోనీతో కలసి దిగిన ఫొటోను అప్ లోడ్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్లలో ధోనీ కంటే ముందు శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర మాత్రమే ఉన్నాడు. వన్డేలో సంగా 14234 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News