: లేవండి, మేల్కోండి... వివేకానందుని వ్యాఖ్యను పోస్ట్ చేసిన సెహ్వాగ్
యువతను మేల్కొలిపి, లక్ష్యసాధన దిశగా వారు పయనించేలా చేసే ఉత్తేజకర వ్యాఖ్యలను చెప్పిన మహానీయుడు స్వామి వివేకానంద 115వ వర్థంతి సందర్భంగా ఈ రోజు భారతదేశం యావత్తు ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ఆ సందర్భంగా ఆయన చెప్పిన సూక్తులను గుర్తు చేసుకుంటోంది. ఈ క్రమంలో స్వామి వివేకానందకు టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ నివాళులు తెలుపుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘లేవండి.. మేల్కోండి.. గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకండి’ అంటూ వివేకానందుడు చెప్పిన వ్యాఖ్యను సెహ్వాగ్ గుర్తు చేశాడు. జనవరి 2, 1863లో కోల్‌కతాలో జన్మించిన వివేకానందుడు జులై 4, 1902లో బేలూర్‌లో పరమపదించారు.