: యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీవీ షో ప్రసారానికి ముహూర్తం ఖరారు!
హిందీలో ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ షోను తెలుగులో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహించనున్నట్లు 'స్టార్ మా' ఛానెల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షోను నిర్వహించేందుకు ప్రణాళికలు రచించిన స్టార్ మా ఈ రోజు మరో ప్రకటన చేసింది. ఈ షోను ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో 12 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షో నిర్వహణ కోసం 60 కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోను, టీజర్ ను స్టార్ మా విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా నిలిచిన ఎన్టీఆర్ మొదటిసారి టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోపై భారీగానే అంచనాలు ఉన్నాయి.