: కాంగ్రెస్ పార్టీకి మల్లాది విష్ణు రాజీనామా... నేటి సాయంత్రం జగన్ తో భేటీ
కాంగ్రెస్ పార్టీకి మల్లాది విష్ణు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పంపించారు. ఆ లేఖను పరిశీలించిన రఘువీరారెడ్డి మల్లాది విష్ణు రాజీనామాను ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఇప్పటివరకు ఆయన విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.