: ఎన్టీఆర్ పేరు వింటేనే ఛాతి ఉప్పొంగుతుంది.. ఎన్టీఆర్ అనే మూడక్షరాలు తెలుగోడు తలెత్తుకునేలా చేశాయి: వర్మ


తెలుగు రాజకీయాలను శాసించి, దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్టు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్మ తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన 'జై ఎన్టీఆర్' పాటను విడుదల చేశాడు. ఈ పాటను ఈ సినిమా కోసమే ఆయన రూపొందించాడు. తాను ఎన్టీఆర్ సినిమాను ఎందుకు తీస్తున్నానో వివరిస్తూ ఆయన ఓ ఆడియో విడుదల చేశాడు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగువాడిని తలెత్తుకునేలా చేశాయని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ పేరు వింటేనే స్వాభిమానం తన్నుకొస్తుందని... ఛాతి గర్వంతో ఉప్పొంగుతుందని చెప్పారు. ఆయన మహా నటుడే కాదని... మన తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా అత్యధిక ప్రజాదరణ కలిగిన అంతటి రాజకీయ నేతను చూడలేదని అన్నాడు. 

  • Loading...

More Telugu News