: 'కంబాలా' ఇక చట్టబద్ధం... కర్ణాటక వాసులకు రాష్ట్రపతి వరం!
కర్ణాటకలో సంప్రదాయ పశుక్రీడ 'కంబాలా' చట్టబద్ధమైంది. ఈ మేరకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదించిన జంతువుల క్రూరత్వ నివారణ చట్టానికి సవరణల ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు. ఇది తమ రాష్ట్ర సంప్రదాయంలో భాగమని, ముఖ్యంగా తీర ప్రాంతంలోని రైతులు, భూస్వాములు, ప్రజలు దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటారని, పంటలు చేతికి వచ్చే నవంబర్ నుంచి ఇది ప్రారంభమవుతుందని కర్ణాటక ప్రభుత్వం, గడచిన ఫిబ్రవరిలో దీనికి ఆమోదం పలికిన సంగతి తెలిసిందే. అంతకుముందు తమిళనాడులో జల్లికట్టుకు అసెంబ్లీ ఆమోదం పలుకగా, అదే స్ఫూర్తితో కన్నడ నాట ఈ నిర్ణయం తీసుకోగా, దానికిప్పుడు రాష్ట్రపతి ఆమోదం పలికారు.