: చైనా అటు జపాన్ తో, ఇటు భారత్ తో దూకుడుగా వ్యవహరిస్తోంది.. తగిన మూల్యం చెల్లించుకుంటుంది: రష్యా
చైనా తీరుపై రష్యా మీడియా మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను విస్తరించుకుంటోన్న చైనా... అదే స్థాయిలో శత్రువులను కూడా పెంచుకుంటోందని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం అంశంలో చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ట్రీటోన్ దీవులు తమవేనని చైనా పేర్కొంటున్న తీరుతోనే ఆ దేశ అధినాయకత్వం ఎంత దూకుడుగా ఉందో తెలుస్తోందని విమర్శించింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంలో చైనా తీరుని తప్పు పట్టారని తెలిపింది.
చైనా అధ్యక్షుడికి ట్రంప్ ఫోన్ చేశారని పేర్కొన్న రష్యా మీడియా... పొరుగుదేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెప్పారని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారని తెలిపింది. చైనా జపాన్‌తో పాటు భారత్‌తోనూ ఘర్షణ పూరిత వాతావరణంతో ముందుకు వెళుతోందని పేర్కొంది. ఈ తీరును మార్చుకోకపోతే చైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పింది.