: అల్లు అర్జున్ పై దారుణమైన కామెంట్ చేసిన కేఆర్కే!
టాలీవుడ్ హీరోలపై చీప్ కామెంట్స్ చేయడం బాలీవుడ్ విమర్శకుడు కమాల్ రషాద్ ఖాన్ (కేఆర్కే)కు పరిపాటిగా మారింది. నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నా కేఆర్కే తన పంథాను మార్చుకోవడం లేదు. ఇప్పటికే పవన్ కల్యాణ్, ప్రభాస్ లపై నీచమైన కామెంట్స్ చేసిన కేఆర్కే తాజాగా బన్నీని టార్గెట్ చేశాడు.
ఆలూ మొహం ఉన్న ఇతను తెలుగులో పెద్ద స్టార్ హీరో అని కొంతమంది తనకు చెప్పారంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, 'బ్రదర్ చిన్నిచిన్ని క్యారెక్టర్లు చేయాలనుకుంటేనే నీవు బాలీవుడ్ కు రా' అంటూ దారుణమైన కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో కేఆర్కేపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కేఆర్కేను ఏకిపారేస్తున్నారు. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన యాడ్ ను చూసిన కేఆర్కే బన్నీని ఆలూతో పోల్చాడు.