: డ్రగ్ మాఫియా అంతు చూసేందుకు కదిలిన కేసీఆర్ సర్కారు... సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన డ్రగ్స్ రాకెట్ మూలాలను వెతికి, సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన బడా నిర్మాతలు, పదుల సంఖ్యలో వీఐపీలు, ఎంతో మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో, కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎక్సైజ్ శాఖ, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణం సిట్ ఏర్పాటు చేస్తున్నామని, డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న స్కూళ్లు, ఐటీ కంపెనీలు, హోటళ్లకు నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరినీ విచారిస్తామని అధికారులు వెల్లడించారు.