: ముగ్గురు ముష్కరులను కాల్చి చంపిన సైన్యం.. కొనసాగుతున్న వేట!

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లా బమ్నూలో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భారత సైనికులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళ్తే, బమ్నూలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు భద్రతాదళాలకు సమాచారం అందింది. దీంతో, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు చేపట్టారు సైనికులు. దీన్ని గమనించిన ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతాబలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్ ముష్కరులు హతమయ్యారు. తప్పించుకున్న మరో ఉగ్రవాది కోసం సైన్యం వేట మొదలెట్టింది. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరిని కిఫాయత్ గా సైన్యం గుర్తించింది.

More Telugu News