: 'బాహుబలి-1' షూటింగ్ జరిగిన లొకేషన్లలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్
రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణల కాంబినేషన్లో వచ్చిన 'బాహుబలి' సినిమా భారతీయ సినీ చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సాధించిన అద్భుత విజయంతో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. ఈ సినిమా తొలి భాగాన్ని బల్గేరియాలో చిత్రీకరించారు. ఇప్పుడు ఆ లొకేషన్లకు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ లు వెళుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా పాటలు మినహా సగానికి పైగా షూటింగ్ పూర్తయిందని సమాచారం. పాటల చిత్రీకరణ కోసం బల్గేరియాలో మంచి లొకేషన్లను త్రివిక్రమ్ సెలెక్ట్ చేశాడట. త్వరలోనే అక్కడకు వెళ్లి, సాంగ్స్ షూట్ చేయనున్నారని టాలీవుడ్ టాక్.