: రాముడ్ని వనవాసానికి పంపిన రాత్రి దశరధుడు, కైకేయి మధ్య సంభాషణను షార్ట్ ఫిల్మ్ గా తీస్తున్నాను: రాంగోపాల్ వర్మ ప్రకటన
తనను సినిమాల నుంచి ఎవరూ దూరం చెయ్యలేరని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పేందుకు సోషల్ మీడియాను మాధ్యమంగా ఎంచుకున్నానని వర్మ తెలిపాడు. త్వరలో రాముడు కథ అధారంగా షార్ట్ ఫిల్మ్ తీయనున్నాడని తెలిపాడు. అయితే తన షార్ట్ ఫిల్మ్ లో రాముడి గురించి ఏమీ ఉండదని, రాముడ్ని అడవులకు వెళ్లమని కోరిన రాత్రి దశరధుడు, కైకేయి మధ్య జరిగిన సంభాషణను షార్ట్ ఫిల్మ్ గా తియ్యాలనుకుంటున్నానని వర్మ చెప్పాడు. తానేం తియ్యాలనుకుంటున్నానో అది తీస్తానని... ఎవరో ఏదో చెబితే అది తీయడం ఎలా సాధ్యమవుతుందని అన్నాడు. దీని గురించి ఎవరికి ఎలా నచ్చితే అలా అనుకోవచ్చని రాంగోపాల్ వర్మ తెలిపాడు.