: మా చెల్లికి సర్దిచెప్పి బ్రహ్మానందరెడ్డిని పోటీలో నిలిపాం: అఖిల ప్రియ

నంద్యాల ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన చెల్లెలు మౌనిక తెలిపిందని మంత్రి అఖిల ప్రియ తెలిపారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తన చెల్లెలుకి సర్ది చెప్పి బ్రహ్మానందరెడ్డిని ఎన్నికల బరిలో నిలిపామని చెప్పారు. తమ కుటుంబంలో కూడా విభేదాలు తెచ్చే ప్రయత్నం చేశారని, అయితే వాటన్నింటిని దాటుకుని తాము బరిలో నిలిచామని ఆమె అన్నారు. ఈ ఉప ఎన్నిక తన తండ్రి నియోజకవర్గంలో జరుగుతున్నదని, తన తండ్రి చేయాల్సిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యతతో ఆడబిడ్డగా తాను మాట్లాడుతున్నానని అన్నారు. 

More Telugu News