: చేయకూడని తప్పు చేశానని పేర్కొంటూ... తనువు చాలించిన యువతి!

చేయకూడని తప్పు చేసిన ఓ యువతి, బలవంతంగా తన ప్రాణాలను తీసుకుని, అందుకు దారితీసిన పరిస్థితిని ఓ లేఖలో రాసింది. "జీవితానికో అర్థం ఉందని, బతికే విధానం ఉంటుందని తెలుసుకోలేక పోయాను. బతికే అర్హత నాకులేదు. చచ్చిపోవటం తప్ప నాకు వేరే దారిలేదు. నాన్నా.. నన్ను క్షమించు, ఎవరూ చేయకూడని పని చేశాను" అంటూ లేఖ రాసి మరణించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాకు చెందిన అనిత (19)కు డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన బాణోతు వీరన్న కుమారుడు శ్రీకాంత్ కు వివాహం జరిగింది. కట్టుకున్న భర్తను వదిలి అతని తండ్రి, తనకు మామ అయిన వీరన్నతో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త, ఆమెను పుట్టింటికి పంపగా, లక్ష రూపాయల నగదు, ఏటీఎం కార్డులను దొంగిలించి, మామతో కలసి మే 19న వెళ్లిపోయింది.

ఉన్న డబ్బులన్నీ ఖర్చయిన తరువాత, ఇద్దరూ కలసి తిరిగి వచ్చారు. ఇంటికి పోతే తాను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని తలచుకున్న ఆమె, ఖమ్మం శివారులోని మంచుకొండలో వీరన్నతో కలసి ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగి, ఆపై మణికట్టు కోసుకుంది. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ అనిత మరణించగా, వీరన్న ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. "ఏం చేశానో? ఎవరి కోసం చేశానో? నా జీవితం నాకే అర్థం కాలేదు. బంగారంలాంటి జీవితాన్ని పోగొట్టుకున్నా" అంటూ లేఖలో రాసింది. తన కుమార్తెతో సంబంధం పెట్టుకుని ఆమె చావుకు కారణమైన వీరన్నను కఠినంగా శిక్షించాలని అనిత తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News