: వచ్చే మూడు రోజులూ వర్షాలే: వాతావరణ శాఖ


ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడటం, బంగాళాఖాతంలో 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించినందున వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే దట్టమైన మబ్బులు కమ్ముకోగా, రాయలసీమలో తేలికపాటి జల్లులు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఓ అధికారి తెలిపారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉరుములతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News