: దేవుళ్లకూ తప్పని జీఎస్టీ పోటు.. ఏపీలో జీఎస్టీ పరిధిలోకి 179 ఆలయాలు

గత అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం మనుషులపైనే కాదు, దేవుళ్లపై కూడా పడింది. ఏపీలోని 179 ఆలయాలు జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండే ఆలయాలు జీఎస్టీలో నమోదు చేసుకోవాలని వాణిజ్య పన్నుల అధికారులు ఇటేవలే పలు ఆలయాల ఈవోలకు లేఖలు రాశారు. ఏపీ మొత్తం మీద 23,834 ఆలయాలు ఉన్నాయి. వీటిలో రూ. 20 లక్షల ఆదాయం దాటే ఆలయాలు 179 ఉన్నాయి. రూ. 25 కోట్ల ఆదాయం దాటే ఆలయాలు 7 ఉన్నాయి.

జీఎస్టీ కింద ప్రసాదాలకు పన్ను మినహాయింపు లభించింది. అయితే, ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, జీడిప్పుపై పన్ను పోటు ఉంది. అగరబత్తులు, అద్దె గదులు, వివిధ సేవల టికెట్లు, హుండీలు, తలనీలాలు, భూముల కౌలు తదితరాలపై జీఎస్టీ ఉంటుంది.

More Telugu News