: అనంత్ నాగ్ లో ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. హోరాహోరీ కాల్పులు.. మహిళ మృతి


జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో వారు దాక్కున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో, భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో, భద్రతా బలగాలు ప్రతికాల్పులు జరుపుతున్నాయి. ప్రస్తుతం రెండువైపుల నుంచి హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ తీవ్రంగా గాయపడి కన్నుమూసింది. 

  • Loading...

More Telugu News