: కొత్త రకం పందిని రూపొందించిన వెంకటేశ్వర యూనివర్శిటీ... 'తిరుపతి వరాహ' అంటూ నామకరణం


తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ కొత్త రకం పందిని రూపొందించింది. దీనికి 'తిరుపతి వరాహ' అని నామకరణం చేసింది. ఈ రోజు జరగనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో వీటిని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జీనా విడుదల చేయనున్నారు. ఈ యూనివర్శిటీలో 1971 నుంచి 'ఆలిండియా కోఆర్డినేటెడ్‌ రీసర్చ్ ప్రాజెక్ట్ ఆన్ పిగ్స్' పేరిట పరిశోధనలు కొనసాగుతున్నాయి.

1971 నుంచి 1981 వరకు సీమ పందులపై, 1981 నుంచి 1987 వరకు నాటు పందులపై పరిశోధనలు జరిగాయి. 1987 నుంచి 2007 వరకు సీమ పందులు, నాటు పందులను సంకరీకరించి కొత్త రకాన్ని ఉత్పత్తి చేశామని వైస్ ఛాన్సలర్ హరిబాబు తెలిపారు. 21 తరాల తర్వాత ఎలాంటి అవలక్షణాలు లేని పంది రకం ఉత్పత్తి అయిందని తెలిపారు. ఈ కొత్త రకం పందిలో 75 శాతం సీమ పంది, 25 శాతం నాటు పంది లక్షణాలు ఉంటాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News