: కెనడా తరపున ప్రపంచ సుందరి పోటీలకు ఎంపికైన తెలంగాణ యువతి

కెనడా దేశ ప్రతినిధిగా ప్రపంచ సుందరి పోటీలకు తెలంగాణ యువతి ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ సుందరి పోటీల్లో కెనడా తరఫున కళ్యాణపు శ్రావ్య ఎంపికైంది. ఖమ్మం జిల్లాకు చెందిన కళ్యాణపు రవికుమార్, పార్వతి దంపతుల కుమార్తె అయిన శ్రావ్య 7వ తరగతి వరకు వైరాలోని జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ లో చదివింది. అనంతరం వారి కుటుంబం కెనడాలో స్థిరపడింది. మిస్‌ నార్తర్న్‌ అల్బెర్టా వరల్డ్‌-2017 కిరీటాన్ని గెలుచుకుని కెనడా తరపున ప్రపంచ సుందరి పోటీలకు ఎంపికైంది. మిస్ నార్తర్న్ అల్బెర్టా సుందరిగా విజయం సాధించడం, ప్రపంచ సుందరి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమె చిన్ననాటి స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. 

More Telugu News