: జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలు.. సర్వాంగ సుందరంగా పార్లమెంట్ భవనం!
నేటి అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలు రాత్రి 11 గంటలకు మొదలై అర్ధరాత్రి దాటే వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొననున్నారు. కాగా, జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ బాటలోనే వామపక్షాలు, డీఎంకే నడవనున్నాయి.