: సచిన్ కు ఆ విషయం చెప్పగానే భావోద్వేగానికి గురయ్యాడు: కమిషనర్ మహేష్ భగవత్
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన 'హీరో' అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తండ్రి రమేష్ టెండూల్కర్ వద్ద మహేష్ భగవత్ విద్యను అభ్యసించారట. సచిన్ తండ్రి తమకు మరాఠీ సాహిత్యం పాఠాలు చెప్పేవారని తెలిపారు. ఇంతకు ముందు సచిన్ ఓసారి హైదారాబాద్ వచ్చినప్పుడు... 'మీ నాన్నగారు నాకు టీచర్' అని చెప్పానని... దీంతో, సచిన్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడని చెప్పారు. తాను ఇప్పటికీ మరాఠీ సాహిత్యాన్ని చదువుతుంటానని భగవత్ తెలిపారు.