: ఈ శతాబ్దంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత... ఇరాన్ పై భానుడి ప్రకోపం!
ఇప్పటివరకూ ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులు నేడు బద్దలయ్యాయి. భూమధ్య రేఖకు సమీపంలో ఉండే ఇరాన్ లో నేడు 53.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆహ్వాజ్ నగరం పాత రికార్డులను బద్దలు కొట్టింది. భానుడి ఆగ్రహానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడారి ప్రాంతాల్లో ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా పలువురు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎవరినీ బయట తిరగవద్దని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కాగా, 1913 జూలై 10న అమెరికాలోని డెత్ వ్యాలీలో 56.7 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కాగా ఆపై ఆ స్థాయికి దగ్గరగా ఉష్ణోగ్రత రావడం ఇదే తొలిసారి.