: జీఎస్టీ వేడుకలకు దూరంగా నితీశ్ కుమార్
ఇటీవలి కాలంలో బీజేపీకి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి దగ్గరవుతున్నారని భావిస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్, నేటి రాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే జీఎస్టీ వేడుకలకు గైర్హాజరు కానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ నుంచి దాదాపు అందరు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు తదితరులెందరో పాల్గొనే ఈ కార్యక్రమానికి తాము రాబోవటం లేదని ఇప్పటికే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీలు స్పష్టం చేయగా, తాజాగా నితీశ్ కూడా డుమ్మా కొట్టాలని నిర్ణయించారు. తన పార్టీ తరఫున రాష్ట్ర మంత్రి విజేంద్ర యాదవ్ ను పంపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.