: హాలీవుడ్ లో ఎగిరిన రజనీకాంత్ బెలూన్!.. వీడియో మీరూ చూడండి!
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ సినిమా '2.0'పై భారీ అంచనాలు ఉన్నాయి. పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీసును కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్ ను అప్పుడే ప్రారంభించారు దర్శకనిర్మాతలు. అయితే, ఇండియాలో కాకుండా తొలి ప్రమోషన్ ను హాలీవుడ్ లో ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
లాస్ ఏంజెలెస్ లోని హాలీవుడ్ లేక్ పార్క్ లో '2.0' చిత్రాలను ముద్రించిన 100 అడుగుల హాట్ బెలూన్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ తరహా బెలూన్ లు త్వరలోనే లండన్, ఐరోపా, దక్షిణాసియా దేశాల్లో ఎగరనున్నాయి. దీనికితోడు, ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ హాట్ బెలూన్లను ఎగురవేయాలని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ భావిస్తోంది.