: నేను పిచ్చోణ్ణా... కాళిదాసులా కనిపిస్తున్నానా?: చిందులుతొక్కిన లాలూప్రసాద్ యాదవ్
మీడియాపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. బీహార్ లో అధికారంలో ఉన్న జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో బీటలు వస్తున్నాయా?... రాష్ట్రపతి ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తున్నారు? మీరు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తున్నారు? ఇవి విభేదాలకు సంకేతాలు కాదా? అంటూ మీడియా ఆయనను పాట్నాలో ప్రశ్నించింది. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ లాలూ ప్రసాద్ యాదవ్... నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? లేక కాళిదాసులా కనిపిస్తున్నానా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చున్న కొమ్మను నరుక్కుంటానా? అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.