: మలయాళ సూపర్‌స్టార్స్‌ సెల్ఫీ చూసి సంబరపడిపోతున్న అభిమానులు!


మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి తమ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీని అభిమానులతో పంచుకున్నారు. ఈ సెల్ఫీని మోహన్ లాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ‘విత్ మమ్ముక్కా’ అని పేర్కొన్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి దిగిన సెల్ఫీ చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా, రియల్ లైఫ్ లో మోహన్ లాల్, మమ్ముట్టి మంచి మిత్రులు. ప్రస్తుతం ‘వెళిపడింతె పుస్తకం’ చిత్రంలో మోహన్ లాల్ నటిస్తుండగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'కాలా'లో మమ్ముట్టి ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News