: పీవీ సింధుకి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ఆమోదం... డిప్యూటీ కలెక్టర్ పోస్టు పట్ల తెలుగు తేజం ఆసక్తి!


భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ పీవీ సింధు ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించి దేశానికి గర్వ‌కార‌ణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమెకు నజరానా అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇస్తామ‌ని చెప్పింది. ఈ అంశంపై క‌స‌ర‌త్తు చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు ఈ రోజు ఆమోదం తెలిపింది. డిప్యూటీ కలెక్టర్ పోస్టు పట్ల పీవీ సింధు ఆసక్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్లు స‌మాచారం. పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం అంశంలో ఏపీపీఎస్సీ త్వ‌ర‌లోనే నియామ‌క‌ ఉత్త‌ర్వులు ఇవ్వ‌నుంది.       

  • Loading...

More Telugu News