: కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డికి ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు


చెల్లని చెక్కును ఇచ్చిన కేసులో కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ క‌ర్నూలు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. బాల‌య్య అనే వ్య‌క్తికి కొన్ని ల‌క్ష‌లు ఇవ్వాల్సి ఉన్న కేశవ‌రెడ్డి గ‌తంలో ఆయ‌న‌కు ఓ చెల్ల‌ని చెక్ ఇచ్చి మోసం చేశారు. రెండు నెల‌ల్లోగా బాల‌య్య‌కు రూ.25 ల‌క్ష‌లు చెల్లించాల‌ని కూడా కోర్టు తీర్పునిచ్చింది. కాగా, కర్నూలు జిల్లా కేంద్రంగా విద్యా సంస్థలను స్థాపించిన కేశ‌వ‌రెడ్డి ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేసి, వాటిని తిరిగి ఇవ్వని నేరం కింద గ‌తంలో అరెస్టు అయి జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు.

  • Loading...

More Telugu News