: ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు?: బీసీసీఐపై మండిపడ్డ లాల్ చంద్ రాజ్ పుత్
హెడ్ కోచ్ పదవి కోసం రెండోసారి దరఖాస్తులను ఆహ్వానించిన బీసీసీఐపై లాల్ చంద్ రాజ్ పుత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తొలిసారి దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు టామ్ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్ ఫైబస్ తదితరులతో పాటు లాల్ చంద్ కూడా అప్లై చేశాడు. ఇప్పుడు మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు దరఖాస్తులు చేసినవారు బీసీసీఐకి సరిపోలేదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఎవరికి హెడ్ కోచ్ పదవిని కట్టబెట్టేందుకు మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని అడిగారు.
కాగా, ఇప్పుడు రవిశాస్త్రి పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సచిన్ సూచనతో హెడ్ కోచ్ పదవిపై రవిశాస్త్రి ఆసక్తి కనబరుస్తున్నాడని చెబుతున్నారు. కోహ్లీ కూడా శాస్త్రి వైపే మొగ్గు చూపుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లీ, రవిశాస్త్రిలపై నెటిజన్లు మండిపడుతున్నారు.