: మరో 'నారాయణ' వివాదం... మందు కొట్టి హింసిస్తున్నారని ప్రిన్సిపల్ పై విద్యార్థుల ఫిర్యాదు


నిన్న హైదరాబాద్, నిజాంపేటలోని నారాయణ కళాశాలలో జరిగిన ఘటనను మరువకముందే, మరో నారాయణ కాలేజీలో జరుగుతున్న దారుణంపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అనంతపురంలోని టీవీ టవర్ సెంటర్ వద్ద ఉన్న ఇంటర్ క్యాంపస్ లో, కళాశాల ప్రిన్సిపల్ శిఖామణి, లెక్చరర్ శ్రీనివాస్ లు మద్యం తాగి తమను హింసించారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజూ చిత్రహింసలు పెడుతున్నారని మీడియా ఎదుట వాపోయారు. కళాశాల యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తే, కట్టిన ఫీజులు వెనక్కు రావన్న ఉద్దేశంతో సర్దుకుని పోవాలని చెబుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News