: కేంద్ర మంత్రి ఎంతపని చేశారు? ... స్వచ్ఛభారత్ అపహాస్యమైంది!
ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ ను అపహాస్యం చేసిన ఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ (67) బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. సెక్యూరిటీ వెనుదిరిగి ఉండగా, రోడ్డు పక్కన ఆయన మూత్ర విసర్జన చేశారు. స్వచ్ఛభారత్ యాడ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అంతే కాకుండా స్వచ్ఛబారత్ సెస్ ను కూడా ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.