: ఎంపీ కొత్తపల్లి గీత కేసులో అతిపెద్ద ట్విస్ట్... కేసును ఉపసంహరించుకున్న సంధ్యారాణి
అరకు పార్లమెంట్ సభ్యురాలు, వైకాపా టికెట్ పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కొత్తపల్లి గీత కుల వివాదం కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని తొలుత కేసు వేసిన తెలుగుదేశం పార్టీ మహిళా నేత, ఎమ్మెల్సీ సంధ్యారాణి యూటర్న్ తీసుకున్నారు.
ఆమె ఎస్టీ కాదని, అయినప్పటికీ ఎస్టీనని చెబుతూ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని ఆరోపిస్తూ, 2014 ఎన్నికలు ముగిసి, గీత విజయం సాధించిన తరువాత వేసిన కేసును సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. కాగా, కొత్తపల్లి గీత తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుండటం, ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉండటంతో, కోర్టుల్లో పోరాటాలు ఎందుకని భావించిన చంద్రబాబు చేసిన సూచన మేరకే సంధ్యారాణి కేసును వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది.