: 'ముస్లింవై ఉండి చీరకడతావా?' అంటూ బాలీవుడ్ నటిని తిట్టిపోసిన నెటిజన్లు

బాలీవుడ్‌ నటి సోహా అలీ ఖాన్‌ చీరకట్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబి రంగు చీర కట్టుకుని, చక్కగా పూలు, బొట్టు పెట్టుకుని భర్త కునాల్‌ ఖేముతో కలిసి దిగిన ఫోటోను సోహా అలీ ఖాన్ తన ఇన్ స్టా గ్రాం ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీనికి ‘బెలూన్‌ లు లేకుంటే పార్టీ కాదు’ అంటూ వ్యాఖ్యను జతచేసింది. ఈ ఫోటోను పలువురు ప్రశంసించగా...కొందరు నెటిజన్లు...'నువ్వు రంజాన్ కు శుభాకాంక్షలు చెప్పలేదు...నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది, నువ్వు ముస్లిం కాదు’ అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచి, 'ఆమెకు నచ్చిన దుస్తులను ధరిస్తారు, మధ్యలో మీ పెత్తనమేంటని' ప్రశ్నించారు. కాగా, సీమంతం సందర్భంగా ఆమె చీరకట్టినట్టు తెలుస్తోంది. ఈమధ్య బాలీవుడ్ నటీమణులు ప్రియాంకా చోప్రా, ఫాతిమా సనా షేక్ ల దుస్తులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

More Telugu News