: వాటికన్ చర్చి మతాధిపతిపై సంచలన ఆరోపణలు.. సెక్స్ స్కాండల్‌లో కేసు నమోదు చేసిన ఆస్ట్రేలియా పోలీసులు


వాటికన్‌కు చెందిన రోమన్ కాథలిక్ మతాధిపతిపై ఆస్ట్రేలియా పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ కేథలిక్, పోప్ ఫ్రాన్సిస్ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వజైర్ అయిన జార్జ్ పెల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీర్ఘకాలంగా చర్చిలో సాగుతున్న సెక్స్ స్కాండల్‌పై ఈ అభియోగాలు నమోదయ్యాయి. ‘హిస్టోరిక్ సెక్సువల్ అఫెన్సెస్’ కింద ఆస్ట్రేలియా కోర్టు ఎదుట హాజరు కావాల్సిందిగా పెల్‌కు సమన్లు జారీ చేసినట్టు విక్టోరియా స్టేట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ షేన్ పేటన్ తెలిపారు. పెల్‌పై చాలా ఫిర్యాదులు ఉన్నట్టు పేర్కొన్న ఆయన అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. కాగా, తనపై వస్తున్న ఆరోపణలను పెల్ ఖండించారు.

  • Loading...

More Telugu News