: ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేలా మోదీ పర్యటన సాగింది: సీపీఐ నేత నారాయణ విమర్శలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేలా మోదీ పర్యటన సాగిందని, ఆయన పర్యటనతో దేశానికి ఒరిగిందేమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేయడంపైనా ఆయన విమర్శలు చేశారు. కోవింద్ లాంటి ఆర్ఎస్ఎస్ వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా వద్దని చెప్పామని, అయినా పట్టించుకోలేదని అన్నారు. జీఎస్టీ వల్ల సంపన్నులకు, కార్పొరేట్ కంపెనీలకే లాభమని, నష్టపోయేది సామాన్యులేనని నారాయణ విమర్శించారు.

More Telugu News