: నెదర్లాండ్స్ ప్రధాని ఇచ్చిన కానుకను అపురూపంగా ఇండియాకు తెచ్చుకున్న మోదీ


పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ, పరిశుభ్రమైన దేశాల్లో ముందు వరుసలో నిలిచే నెదర్లాండ్స్ లో తాను పర్యటించిన వేళ, డచ్ ప్రధాని మార్క్ రుట్టే ఇచ్చిన ఓ కానుకను ప్రధాని మోదీ అపురూపంగా తీసుకు వచ్చారు. మూడు దేశాల పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమైన మోదీ, తన విమానంలో మార్క్ బహూకరించిన సైకిల్ ను వెంట తెచ్చుకున్నారు. తాను ఏ దేశ పర్యటన నిమిత్తం ఎక్కడికి వెళ్లినా, ఆయా దేశాధినేతలకు కానుకలను ఏరి కోరి మోదీ తీసుకు వెళతారన్న సంగతి తెలిసిందే.  ఇక నిన్న తనకు బహూకరించిన సైకిల్ ఎక్కి, మార్క్ కార్యాలయంలో కాసేపు చక్కర్లు కొట్టారు మోదీ. ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News