: కేసీఆర్ కంటి ఆపరేషన్ వాయిదా.. రేపు జరిగే అవకాశం!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి ఆపరేషన్ రేపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఆపరేషన్ ను సోమవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే, కేసీఆర్ కు బీపీ, షుగర్ కంట్రోల్ కాకపోవడంతో ఆ రోజు నిర్వహించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయనకు ఆపరేషన్ చేయాల్సిన ప్రధాన వైద్యుడు సత్యదేవ్ అందుబాటులో లేకపోవడంతో... శస్త్రచికిత్స మరోసారి వాయిదా పడిందట. అయితే, డాక్టర్లు మాత్రం ప్రతిరోజు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వచ్చి, ఆయనకు కంట్లో చుక్కల మందు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మందుతోనే ఆయన ఉపశమనం పొందుతున్నారు. రేపు ఆయనకు ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News