: పోలీస్ స్టేషన్ లో కూతురిపై అత్యాచారం చేసిన తండ్రి


తండ్రీ కూతుళ్ల బంధానికి ఆ తండ్రి మాయని మచ్చను తెచ్చాడు. దిగజారుతున్న నైతికతకు నిదర్శనంగా నిలిచాడు. పోలీస్ స్టేషన్ సాక్షిగా కన్నకూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... యూపీలోని మధురలోని మంత్ చౌకీ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఏఎస్ఐ (58)ని కలిసేందుకు అతని వివాహిత కుమార్తె (35) పోలీస్ స్టేషన్ కు వచ్చింది. వాస్తవానికి ఆమె అనారోగ్యం కారణంగా ఫిరోజాబాద్ నుంచి ఆగ్రాకు వచ్చింది. వైద్య పరీక్షలన్నీ పూర్తి కాకపోవడంతో దగ్గర్లోని మధురలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చింది.

అయితే ఏఎస్సై అయిన ఆ తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి పోలీస్ అవుట్ పోస్టులోనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండ్ చేసి, అరెస్టు చేసి, ఐపీసీ సెక్షన్ 376, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్న ఏఎస్సై కూతురిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 14 ఏళ్ల వయసులో ఉండగా, ఇలాగే ఆమెపై ఆ తండ్రి లైంగిక వేధింపులకు దిగాడని, తరువాత వివాహం జరగడంతో ఎలాంటి దారుణాలు చోటుచేసుకోలేదని, తండ్రి మారి ఉంటాడన్న నమ్మకంతో వస్తే మళ్లీ దారుణానికి ఒడిగట్టాడని ఆమె వాపోయింది.

  • Loading...

More Telugu News