: బ్యూటీషియన్ శిరీష అందుకే ఆత్మహత్య చేసుకుంది: హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ


హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం క‌లిగించిన‌ బ్యూటీషియ‌న్ శిరీష హ‌త్య‌కేసులో వ్య‌క్త‌మ‌వుతున్న అనుమానాల‌పై హైద‌రాబాద్‌ వెస్ట్‌జోన్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర‌రావు స్పందించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... శిరీష‌పై కుకునూర్ ప‌ల్లిలో అత్యాచారం జ‌రిగిందా? లేదా? అనే అంశం తేలాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే ఆ విష‌యం తెలుస్తుంద‌ని తెలిపారు. అయితే శిరీషది మాత్రం ఆత్మహత్యేనని ఆయన తేల్చిచెప్పారు. ఆ రోజు రాత్రి జ‌రిగిన ఘ‌ట‌న‌తోనే శిరీష‌ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఈ కేసులో రాజీవ్‌, శ్రవణ్‌లను విచారిస్తున్నామని చెప్పారు. ఆ రోజు శిరీష, రాజీవ్‌, శ్రవణ్‌, ప్రభాకర్‌రెడ్డి ఓ ఫామ్‌హౌస్‌ కు వెళ్లారని వస్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కేసులో శిరీష బంధువులకి అనుమానాలుంటే నివృత్తి చేస్తామని తెలిపారు.        

  • Loading...

More Telugu News