: 2.0 లో అక్షయ్ కుమార్ గ్రహాంతరవాసా?
రజనీకాంత్ `రోబో 2.0`లో అక్షయ్ కుమార్ గెటప్ చూసిన వాళ్లందరికీ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గ్రహాంతరవాసేమో అన్న అనుమానం కలిగింది. ప్రస్తుతం ఆ అనుమానానికి మద్ధతుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో అక్షయ్ పాత్ర పేరు `మిస్టర్ క్రౌ` అని, వేరే గ్రహం నుంచి భూమ్మీదకి వచ్చాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే సినిమా ట్యాగ్‌లైన్ కూడా `ద వరల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్` అని ఉండటం కూడా చర్చనీయాంశమైంది.
రజనీ, అక్షయ్‌లతో పాటు ఈ సినిమాలో అమీ జాక్సన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అమీ కూడా లేడి రోబో పాత్రలో నటిస్తోందని సమాచారం. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జనవరి 25, 2018కు వాయిదా వేశారు. దీపావళి సమయానికి ఆడియో విడుదల చేసి, ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని చిత్రయూనిట్ భావిస్తోంది.