: నా భర్త మృతికి శిరీష వివాదం కారణం కానే కాదు: మీడియా ముందుకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి భార్య రచన


శిరీష మరణం వెనుక తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేసిన వేళ, ఈ ఉదయం కేసులో కీలక సాక్షి తేజస్విని వెలుగులోకి రాగా, ఆపై కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన తొలిసారిగా తన వాదనను వినిపించారు. తన భర్త మృతికి శిరీష వివాదం కారణం కానేకాదని, ఇటువంటి కేసులను ఆయన ఎన్నింటినో పరిష్కరించాడని చెప్పిన ఆమె, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఏసీపీ గిరిధర్ తన భర్తను వేధించాడని, ఆయన్ను విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందని అన్నారు. ఆయన ఆత్మహత్యకు కారకులైన వారిపై డిపార్టుమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News