: ఆ లిస్టులో మహేశ్ బాబు ర్యాంక్ మరింత పడిపోయింది!


సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్. మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మహేశ్ ర్యాంక్ దిగజారింది. గతంలో ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో నిలిచిన మహేశ్.. 2015లో 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది మరింత దిగజారి 7వ స్థానానికి పడిపోయాడు. మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో తొలి స్థానాన్ని మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, ఫవాద్ ఖాన్ లు ఉన్నారు. దక్షిణాది హీరోల్లో ప్రభాస్ 22వ ర్యాంకులో నిలవగా, రానా 24, ధనుష్ 26 స్థానాల్లో నిలిచారు.

  • Loading...

More Telugu News